Posts

అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పేపర్ క్రేన్‌ల తయారీ

Image
  అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పేపర్ క్రేన్‌ల తయారీ వనస్థలిపురం : అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా విధాత సొసైటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న పేపర్ క్రేన్‌ల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతికి ప్రతీకగా భావించే పేపర్ క్రేన్‌లను తయారు చేయడం ద్వారా శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం మరియు మానవత్వం పట్ల అవగాహన కల్పించడం అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారు పేపర్ క్రేన్‌లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీలత గారు మాట్లాడుతూ, సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, సహనం మరియు మానవతా విలువలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా కూడా శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పేర్కొనడం జరిగింది. 📞 మరిన్ని వివరాలకు: 9542366556   #VidhathaSociety #InternationalDayOfPeace #PeaceDay2026 #PaperCranes #PaperCraneForPeace #WorldPeace #PeaceAndHarmony #Unity #Humanity #Tolerance #SocialService #SpreadPe...

మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కార్యక్రమం

Image
    మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఎల్‌బీ నగర్: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా మట్టి వినాయకుల వినియోగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఎల్‌బీ నగర్ "జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల"లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను వినియోగించాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం పండుగల సమయంలో విగ్రహాల తయారీ, నిమజ్జనం కారణంగా నీటి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మట్టి వినాయకుల వినియోగం ఎంతో అవసరమని, సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు, మన సంప్రదాయాలను కూడా కాపాడుకోవచ్చని అలాగే విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కల్పించాలని, పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగ...

మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

Image
మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం విధాత సొసైటీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు , ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ మరియు రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా విధాత సొసైటీ అధ్యక్షురాలు  జి. శ్రీలత గారు  మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పండుగను జరుపుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను జి. శ్రీలత గారు ఆవిష్కరించారు. భవిష్యత్తులో కూడా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకువచ్చేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 📞 మరిన్ని వివరాలకు: 9542366556 #VidhathaSociety #EcoFriendlyGanesha #ClayGanesha #VinayakaChavithi #G...

వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు

Image
  వృద్ధుల సంక్షేమం కోసం మరో ముందడుగు  విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి  శ్రీలత గారు, వృద్ధాశ్రమం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి గారిని మర్యాదపూర్వకంగా కలిసి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధులకు మెరుగైన వసతులు, భద్రత, ఆరోగ్యం మరియు ఆత్మీయమైన వాతావరణం కల్పించే విధంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి సంబంధించిన విషయాలను వివరించారు. వృద్ధులకు అండగా నిలవడం, వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం మనందరి సామాజిక బాధ్యత. ఈ లక్ష్యంతో విధాత సొసైటీ నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556   #VidhathaSociety #OldAgeHome #SeniorCitizens #ElderlyWelfare #ElderlyCare #SocialService #CommunityService #SeniorCitizenCare #ServingSociety #DignityForElders #WelfareOfSeniorCitizens #ServiceIsOurMission  Another Step Towards the Welfare of Senior Citizens  Vidhatha Society President, Smt. Srilatha Garu, respectfully met Additional Collector Smt. Kiranmai Garu to discuss matters related to the establ...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం పూర్తి

Image
    విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ తొలి బ్యాచ్ పూర్తి మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గాంధీనగర్: విధాత సొసైటీ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో నిర్వహించిన ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం తొలి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. మహిళలు మరియు యువతులను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ శిక్షణలో పాల్గొన్న శిక్షణార్థులు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీకి సంబంధించిన వివిధ నమూనాలు, తయారీ పద్ధతులు మరియు స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విధాత సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా విధాత సొసైటీ నిర్వాహకులు శ్రీమతి శ్రీలత గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత మహిళలు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విధాత సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ రమేష్ వావిలాల వాలంటీర్లు పుష్పవల్లి, స్వరూప, విమల తదితరులు పాల్గొనడం జరిగింది.  ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేర్చుకోవాలనుకున...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతం

Image
    విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతం   విధాత సొసైటీ ఆధ్వర్యంలో, మండల: చెన్నారావుపేట, జిల్లా: వరంగల్ లో ఉచిత టైలరింగ్ కోర్సును నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని కుట్టు నైపుణ్యాలను అభ్యసించడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్‌డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్‌లు మొదలైనవి నేర్పించడం జరిగింది. మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. సంస్థ వాలంటీర్లు స్వరూప, సరిత, మమత తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం విధాత సొసైటీ నిరంతరం ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ సమాజాభివృద్ధికి కృషి చేస్తోంది. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556   #VidhathaSociety #FreeTailoringCourse #WomenEmpowerment #SkillDevelopment #TailoringTraining #Vocation...

కొత్తగూడ మండలంలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ శిక్షణ ప్రారంభం

Image
కొత్తగూడ మండలం లో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ శిక్షణ ప్రారంభం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గాంధీనగర్లో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీకి సంబంధించిన ఆధునిక నైపుణ్యాలను నేర్చుకుని, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే అవకాశం కలుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన ఆసక్తి గల మహిళలైనా తమ ప్రాంతంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో విధాత సొసైటీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని లేదా కోర్సుల్లో చేరాలని ఆసక్తి ఉంటే, మమ్మల్ని సంప్రదించండి. 📞 మరిన్ని వివరాలకు: 9542366556 #Vidhat...