Posts

Showing posts from July, 2026

విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతం

Image
    విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కార్యక్రమం విజయవంతం   విధాత సొసైటీ ఆధ్వర్యంలో, మండల: చెన్నారావుపేట, జిల్లా: వరంగల్ లో ఉచిత టైలరింగ్ కోర్సును నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని కుట్టు నైపుణ్యాలను అభ్యసించడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్‌డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్‌లు మొదలైనవి నేర్పించడం జరిగింది. మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. సంస్థ వాలంటీర్లు స్వరూప, సరిత, మమత తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం విధాత సొసైటీ నిరంతరం ఇలాంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ సమాజాభివృద్ధికి కృషి చేస్తోంది. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556   #VidhathaSociety #FreeTailoringCourse #WomenEmpowerment #SkillDevelopment #TailoringTraining #Vocation...

కొత్తగూడ మండలంలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ శిక్షణ ప్రారంభం

Image
కొత్తగూడ మండలం లో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ శిక్షణ ప్రారంభం తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, గాంధీనగర్లో విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో 25 మందికి పైగా మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తయారీకి సంబంధించిన ఆధునిక నైపుణ్యాలను నేర్చుకుని, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకుని తమ కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే అవకాశం కలుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన ఆసక్తి గల మహిళలైనా తమ ప్రాంతంలో నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో చేరి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో విధాత సొసైటీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని లేదా కోర్సుల్లో చేరాలని ఆసక్తి ఉంటే, మమ్మల్ని సంప్రదించండి. 📞 మరిన్ని వివరాలకు: 9542366556 #Vidhat...

మహిళా సాధికారతకు మరో ముందడుగు – చెన్నారావుపేటలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ పూర్తి

Image
మహిళా సాధికారతకు మరో ముందడుగు – చెన్నారావుపేటలో విధాత సొసైటీ  ఆధ్వర్యంలో  టైలరింగ్  శిక్షణ పూర్తి  తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, చెన్నారావుపేట మండలంలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 45 రోజుల ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తైంది.ఈ కార్యక్రమంలో భాగంగా విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ శిక్షణ ద్వారా 40 మందికి పైగా మహిళలు టైలరింగ్ నైపుణ్యాన్ని అభ్యసించి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో విధాత సొసైటీ రాష్ట్ర కోఆర్డినేటర్ వావిలాల రమేష్ గారు, జిల్లా కోఆర్డినేటర్ ప్రసన్న గారు, గ్రామ కోఆర్డినేటర్లు పాల్గొనడం జరిగింది.  టైలరింగ్ నేర్చుకోవాలనుకునే తెలంగాణలోని ఏ జిల్లాకు చెందిన మహిళలైనా విధాత సొసైటీని సంప్రదించండి. మీ స్వయం ఉపాధి ప్రయాణాన్ని మా సంస్థతో ప్రారంభించండి. 📞 మరిన్ని వివరాలకు: 9542366556 #VidhathaSociety #WomenEmpowerment #TailoringTraining #SkillDevelopment #SelfEmployment #WomenEntrepreneurs #CertificateDistribution #Chennaraopet #Warangal #T...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో "స్టూడెంట్ మైండ్ కౌన్సెలింగ్ ప్రోగ్రామ్" నిర్వహించడం జరిగింది.

Image
విధాత సొసైటీ ఆధ్వర్యంలో "స్టూడెంట్ మైండ్ కౌన్సెలింగ్ ప్రోగ్రామ్" నిర్వహించడం జరిగింది. విధాత సొసైటీ ఆధ్వర్యంలో స్టూడెంట్ మైండ్ కౌన్సెలింగ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల ఆలోచనా విధానం, ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యం, లక్ష్య సాధనపై అవగాహన పెంపొందించే అంశాలపై విలువైన కౌన్సెలింగ్ మరియు మార్గదర్శకత్వం అందించబడింది. ఈ కార్యక్రమం వనస్థలిపురం కమ్యూనిటీ హాల్‌లో అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి నేతృత్వంలో నిర్వహించబడింది. విద్యార్థుల మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం మరియు భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.         📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #VidhathaSociety #StudentMindCounselling #MentalHealthMatters #StudentWellbeing #YouthEmpowerment #PersonalityDevelopment #PositiveMindset #SelfConfidence #StressManagement #...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ ముందు అన్నదాన కార్యక్రమం   విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ హాస్పిటల్ ముందు అన్నదాన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పేదలు, నిరాశ్రయులు, వృద్ధులు, వికలాంగులు, రోగుల సహాయకులు మరియు ఆకలితో ఉన్న ప్రజలు ఉచిత భోజనం పొంది లబ్ధి పొందారు."ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆత్మీయంగా భోజనం అందించడం" అనే లక్ష్యంతో విధాత స్వచ్చంద సంస్థ ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు జి. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో వాలంటీర్లు సంధ్య, రాధ, శ్రీవాణి, దీపక్ తదితరులు పాల్గొని తమ విలువైన సేవలను అందించారు. మీరు కూడా ఈ సేవలో భాగస్వాములు కావచ్చు. మీ పిల్లల పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం, పెద్దల జ్ఞాపకార్థం లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో మీ కుటుంబ సభ్యుల పేరుపై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించవచ్చు. విధాత   స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప...