Posts

Showing posts from September, 2026

అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పేపర్ క్రేన్‌ల తయారీ

Image
  అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పేపర్ క్రేన్‌ల తయారీ వనస్థలిపురం : అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా విధాత సొసైటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న పేపర్ క్రేన్‌ల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రపంచ శాంతికి ప్రతీకగా భావించే పేపర్ క్రేన్‌లను తయారు చేయడం ద్వారా శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం మరియు మానవత్వం పట్ల అవగాహన కల్పించడం అలాగే కార్యక్రమంలో పాల్గొన్న వారు పేపర్ క్రేన్‌లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శ్రీలత గారు మాట్లాడుతూ, సమాజంలో శాంతి, పరస్పర గౌరవం, సహనం మరియు మానవతా విలువలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా కూడా శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పేర్కొనడం జరిగింది. 📞 మరిన్ని వివరాలకు: 9542366556   #VidhathaSociety #InternationalDayOfPeace #PeaceDay2026 #PaperCranes #PaperCraneForPeace #WorldPeace #PeaceAndHarmony #Unity #Humanity #Tolerance #SocialService #SpreadPe...

మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కార్యక్రమం

Image
    మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కార్యక్రమం ఎల్‌బీ నగర్: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా మట్టి వినాయకుల వినియోగంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఎల్‌బీ నగర్ "జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల"లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విధాత సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను వినియోగించాలని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రస్తుతం పండుగల సమయంలో విగ్రహాల తయారీ, నిమజ్జనం కారణంగా నీటి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మట్టి వినాయకుల వినియోగం ఎంతో అవసరమని, సహజ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు, మన సంప్రదాయాలను కూడా కాపాడుకోవచ్చని అలాగే విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా మట్టి వినాయకుల వినియోగంపై అవగాహన కల్పించాలని, పర్యావరణ పరిరక్షణ అనేది ఒక్కరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగ...

మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

Image
మట్టి వినాయకులను పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం విధాత సొసైటీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు , ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టిక్ మరియు రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా విధాత సొసైటీ అధ్యక్షురాలు  జి. శ్రీలత గారు  మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా పండుగను జరుపుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన పోస్టర్‌ను జి. శ్రీలత గారు ఆవిష్కరించారు. భవిష్యత్తులో కూడా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకువచ్చేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 📞 మరిన్ని వివరాలకు: 9542366556 #VidhathaSociety #EcoFriendlyGanesha #ClayGanesha #VinayakaChavithi #G...