విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం
విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం: వరల్డ్ ఎన్జీవో డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 27 న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఇది సామాజిక సేవా సంస్థలు (NGOs) ప్రపంచానికి అందించే గొప్ప సేవలను గుర్తించేందుకు, వాటి ప్రభావాన్ని చూపేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించబడింది. విధాత స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.వరల్డ్ ఎన్‌జిఓ డే సందర్బంగా విధాత సొసైటీ ఎన్జీఓ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విధాత సొసైటీ ఎన్జీఓ అధ్యక్షురాలు జి. శ్రీలత గారు నిర్వహించారు, ఈ సందర్భంగా పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు,80 మందికి పైగా ఉచితంగా బిపి , షుగర్ కి సంబంధించిన పరీక్షలు, గుండె కు సంబంధించిన ECG పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. మధు, డా.యోగేష్ మరియు విధాత స్వ...