HIV/AIDS Awareness Programme & Rally by Vidhatha Society NGO

హెచ్ఐవి / ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమం & ర్యాలీ - విధాత స్వచ్చంద సంస్థ:
విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో హెచ్ఐవి / ఎయిడ్స్ అవగాహనా కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా హెచ్ఐవి / ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం, హెచ్ఐవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం, HIV నివారణకు చికిత్స మరియు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం , HIV ఉన్నవారిపై వివక్షత చూపకూడదని విద్యార్దులకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించడం జరిగింది .అలాగే HIV నివారణ కోసం సురక్షితమైన లైంగిక జీవితం పాటించాలని, రక్త మార్పిడి లేదా ఇంజెక్షన్ తీసుకునే ముందు పరిశీలన చేయాలని, గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనల ప్రకారం చికిత్స తీసుకోవాలన్నారు. ఈ HIV దోమలు లేదా ఇతర కీటకాల ద్వారా వ్యాపించదని , వ్యక్తులను తాకడం, వారితో కలసి తినడం, దగ్గరగా కూర్చోవడం ద్వారా హెచ్ఐవి వ్యాపించదని తెలియజేయడం జరిగింది. హెచ్ఐవి ఉన్నవారిని సమాజం అగౌరవంగా చూడకూడదని వారికి మానసిక, శారీరక మద్దతు అందించాలని ,హెచ్ఐవి పరీక్షలు చేయించుకునేల ప్రోత్సాహించాలి అని తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీలో 160 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమాని విధాత స్వచ్చంద సంస్థ అద్యక్షురాలు G.శ్రీలత నిర్వహించారు. అలాగే సంస్థ వాలంటీర్లు పవన్, వసంత, కల్పన, మాధవి, విజయ ఈ ర్యాలీలో పాల్గొనారు.అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ధలు ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు రవేలారా స్వచ్చంద సంస్థను పొగిడారు.
మన సమాజానికి సేవ చేయడానికి మనమందరం కలసి కృషి చేయవచ్చు!
📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
Comments
Post a Comment