Women & Child Welfare Programme
విధాత సొసైటీ NGO ఆధ్వర్యంలో మహిళలు మరియు పిల్లల సంక్షేమ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, గర్భిణీ స్త్రీల మరియు శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, పోషకాహార0 తీసుకోవడం గూర్చి తెలియజేయడం జరిగింది.గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు చేయించి శిశువుల ఆరోగ్యం గూర్చి వారికి తెలియజేయడం జరిగింది. వారు ఎలాంటి పోషకా ఆహారం తీసుకోవాలో వైద్యనిపుణులు చెప్పారు, దాని వల్ల తల్లి మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలియజేసారు . గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోకపోవడం,సరియైన వైద్య పరీక్షలు చేయించుకొకపోవడం వలన శిశు మరణాలు మరియు ఇతర నష్టాలను తెలియజేసారు, ఈ కార్యక్రమం ద్వారా శిశు మరణాలను ఎలా తగ్గి౦చొచ్చు తెలియజేసారు. పేద పిల్లలకు చదువు యొక్క ప్రాముక్యతను తెలిపారు, ముఖ్యంగా బాలికలకు విద్య ఎంత అవసరమో తెలియజేసి వారు చదువుకునేల ప్రోత్సహించారు. మహిళల హక్కులు మరియు బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు . గృహ హింస చట్టాలపై మహిళలకు అవగాహన మరియు సహాయ వ్యవస్థల గురించి వివరించడం జరిగింది .ఈ కార్యక్రమంలో 190 మంది మహిళలు మరియు పిల్లలు పాల్గొన్నారు . ఈ కార్యక్రమం విధాత సొసైటీ NGO అధ్యక్షురాలు G.శ్రీలత గారు నిర్వహించారు, అలాగే దీనిలో వాలంటీర్లు పవన్, వసంత, కల్పన, మాధవి, విజయ పాల్గొనారు. మహిళలు మరియు పిల్లల కోసం ఆరోగ్యమైన, భద్రమైన మరియు శక్తివంతమైన భవిష్యత్తును నిర్మించడానికి అందరం కలిసి పనిచేద్దాం.
మన సమాజానికి సేవ చేయడానికి మనమందరం కలసి కృషి చేయవచ్చు!
📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#VidhathaSocietyNGO #WomenEmpowerment #ChildWelfare #CommunityService #HealthAwareness #EducationForAll
Women and Child Welfare Programme – Vidhatha Society NGO

Comments
Post a Comment