విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమo

విధాత స్వచ్చంద సంస్థ అద్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది:
విధాత స్వచ్చంద సంస్థ సమాజ సేవలో ఒక ప్రముఖ సంస్థగా నిలుస్తూ, ఫిబ్రవరి-11-2025 ఆహార భద్రత లోపిస్తున్న నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ వద్ధ నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆకలితో ఉన్న వారికి , పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించడం,సమాజంలో దయ, సేవాభావాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాలు. ఆకలితో బాధపడుతున్న వారికి అన్నం, కూరలు, పప్పు, చపాతీలు, పండ్లు, నీరు పౌష్టికాహార పదార్థాలు పంపిణీ చేశారు . వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారుఈ కార్యక్రమాని విధాత సొసైటీ అధ్యక్షురాలు G.శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది, అలాగే సంస్థ సభ్యులు కేయూరా మాన్వి, జ్యోతి మహేశ్వర్, వాలంటీర్లు కల్పనా, మాధవి, విజయ, వినయ్, విజయలక్ష్మి, శ్రీ విద్య, పావన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
విధాత స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు సందర్బంగా మరియు ఏ ఇతర కార్యక్రమాలు అయిన వారి యొక్క పేర్ల మీద అన్నదాన కార్యక్రమంకి మీరు కూడా తమవంతు సహాయం చేయవచ్చు. విధాత స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప్పులు, పసుపు,కారం,నూనె ఇతర వంట సామగ్రి అలాగే వాస్తు రూపేణ ధన రూపేణ విరాళంగా ఇవ్వవచ్చు. GPay or Phonepay నెంబర్ 9542366556
మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556
#VidhathaSocietyNGO #FoodForAll #SocialService #EndHunger
Free Food Distribution Program by Vidhatha Society NGO
Comments
Post a Comment