విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న MSME అవగాహన సదస్సు మీరు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ ఏ బిజినెస్ మీకు సరిపోతుందో, ఎలా మొదలుపెట్టాలో తెలియక సందేహాల్లో ఉన్నారా? అనుభవం లేకపోతే ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? ట్రైనింగ్ పూర్తయ్యాక బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ ఎలా తీసుకోవాలి? లోన్ ఎవరు ఇస్తారు? సబ్సిడీ ఉంటుందా? లోన్ కోసం ఏ సర్టిఫికెట్లు కావాలి? బిజినెస్ ప్రారంభించిన తర్వాత సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి కొత్త వ్యాపారవేత్త మనసులో సహజంగానే వస్తాయి. ఈ అన్ని సందేహాలకు ఒకే చోట సరైన సమాధానాలు తెలుసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది. విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న MSME అవగాహన సదస్సు లో MSME అధికారులు, బ్యాంకర్లు, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్ అందరూ ఒకే వేదికపై పాల్గొని, మీ సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. వ్యాపారం ప్రారంభించే ముందు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగించుకోవాలి, లోన్ మరియు సబ్సిడీ అవకాశాలు ఏమిటి అన్న విషయాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఈ అవగాహన సదస్సు అటెండ్ అవడం వల్ల మీరు బిజినెస్ ప్రారంభించే ముం...
Comments
Post a Comment