Posts

విధాత సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అవగాహన ర్యాలీ

Image
విధాత సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అవగాహన ర్యాలీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న పాటించే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే సందర్భంగా విధాత సొసైటీ ఆధ్వర్యంలో  పొల్యూషన్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం వంటి పర్యావరణానికి హానికరమైన అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విద్యార్థులు, యువత మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.విధాత  స్వచ్చంద సేవాసంస్థ   అధ్యక్షురాలు శ్రీలత నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. ఉపాధ్యక్షురాలు  కేయూరా మాన్వి  మరియు ఇతర ప్రముఖులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ధనుష్ మరియు సేవాసంస్థ వాలంటీర్లు విజయ, కల్పన, మాధవి, వసంత, సునీత, వినయ్, అంకిత పాల్గొన్నారు. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #VidhathaSociety #NationalPollutionControlDay #PollutionAwareness #EnvironmentProtection #StopPollution #CleanAndGreen #CommunityService #AwarenessRally #SaveNature #SocialService #NGOActivities #EcoFriendly National Pollution Control Day – Awaren...

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం – విధాత సొసైటీ నిర్వహించిన అవగాహన కార్యక్రమం

Image
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం – విధాత సొసైటీ నిర్వహించిన అవగాహన కార్యక్రమం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఒక ప్రముఖమైన ఆరోగ్య చైతన్య దినోత్సవం. ఈ రోజు హెచ్ఐవి/ఎయిడ్స్ గురించి సమాజంలో అవగాహన పెంపొందించడం, బాధితులకు మద్దతుగా నిలవడం వంటి ముఖ్యమైన సందేశాలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విధాత సొసైటీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజాభివృద్ధికి ముందడుగు వేసింది.విధాత సొసైటీ ఆధ్వర్యంలో ప్రజల్లో హెచ్ఐవి వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిరంతర ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యత వంటి ముఖ్య విషయాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పాఠశాలలు, కాలనీలు మరియు కమ్యూనిటీ ప్రాంతాల్లో విద్యా వర్క్‌షాప్‌లు నిర్వహించి, హెచ్ఐవి పై ఉన్న అపోహలను తొలగించడం, బాధితులపై ఉండే సామాజిక ముద్రను తగ్గించడం వంటి అంశాలను విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమాల్లో విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి గీని శ్రీలత గారు , ఉపాధ్యక్షులు శ్రీ జ్యోతి మహేశ్వర్ గారు , జాయింట్ సెక్రటరీ శ్రీమతి కేయూర మణ్వి గారు , అలాగే వాల...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం

Image
విధాత  సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం విధాత  సొసైటీ నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ, గ్రామీణ మహిళలకు స్వావలంబన కలిగించే దిశగా పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ క్రమంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన  టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు  పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ కోర్సులో మహిళలకు కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్, దుస్తుల కొలతలు, ఫినిషింగ్ టెక్నిక్స్ వంటి విభిన్న అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించబడింది. శిక్షణ ద్వారా వారు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించగలరు లేదా టైలరింగ్ రంగంలో ఉపాధి పొందగలరు.కోర్సు పూర్తయిన సందర్బంగా   విధాత  సొసైటీ తరఫున  సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం  నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా శ్రీమతి లక్ష్మీ రామమూర్తి గారు  విచ్చేసి, శిక్షణ పూర్తిచేసిన మహిళలను అభినందించారు. ఆమె మాట్లాడుతూ — “మహిళల ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. రవెలారా సొసైటీ తీసుకుంటున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం” అని పేర్కొన్నా...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు   మన్సూరాబాద్ ZPHS స్కూల్లో  ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది.  అలాగే  వాలంటీర్లు వసంత, సురేష్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు  సందర్బంగా  మరియు  ఏ ఇతర కార్యక్రమాలు  అయిన వారి యొక్క పేర్ల మీద  అన్నదాన కార్యక్రమంకి  మీరు కూడా తమవంతు సహాయం చేయవచ్చు.  విధాత   స్వచ్చంద సంస్థకి బియ్యం,కూరగాయలు, పప్పులు, పసుపు,కారం,నూనె  ఇతర వంట సామగ్రి అలాగే వాస్తు రూపేణ ధన రూపేణ విరాళంగా  ఇవ్వవచ్చు. GPay or Phonepay నెంబర్    9666602371 మరిన్ని వివరాలు లేదా పా...

విధాత స్వచ్చంద సేవాసంస్థ - సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం

Image
విధాత స్వచ్చంద సేవాసంస్థ - సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం  విధాత  స్వచ్చంద సేవాసంస్థ  ఆధ్వర్యంలో  సీడ్ బాల్స్ తయారీ  కార్యక్రమం  ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా  సీడ్ బాల్స్ అంటే ఏమిటి,అవి పర్యావరణానికి ఎలా సహాయపడతాయి, విత్తనాల ఎంపిక మరియు పర్యావరణానికి అనుగుణంగా వాటిని వాడటం గురించి,వాటిని ఖాళీ భూముల్లో, అడవులలో, రహదారుల వద్ద విస్తరించడం,పర్యావరణ పరిరక్షణ కోసం ఇవి ఏ విధంగా ఉపయోగ పడతాయి అని విద్యార్దులకి అవగాహన కల్పించడం జరిగింది.  విధాత  స్వచ్చంద సేవాసంస్థ   అధ్యక్షురాలు శ్రీలత నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా 20 రకాల విత్తనాలతో   సీడ్ బాల్స్ తయారుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  40 మందికి పైగా విద్యార్దులు పాల్గొనడం జరిగింది.  పర్యావరణ పరిరక్షణలో మీ వంతు సహాయం అందించడానికి మరియు  సీడ్ బాల్స్ కావాల్సిన వారు మా యొక్క  విధాత  స్వచ్చంద సేవాసంస్థను సంప్రదించగలరు.  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556  ...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
  విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు  నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ వద్ధ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  2 00 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది.  అలాగే  వాలంటీర్లు సురేష్,దీపక్,అనిత,సంజన  తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు  సందర్బంగా  మరియు  ఏ ఇతర కార్యక్రమాలు  అయిన వారి యొక్క పేర్ల మీద  అన్నదాన కార్యక్రమంకి  మీరు కూడా తమవంతు సహాయం చేయవచ్చు.  విధాత   స్వచ్చంద సంస్థకి...

విధాతా సొసైటీ ఆధ్వర్యంలో స్వయం సహాయ బృందాల అవగాహన కార్యక్రమం

Image
  స్వయం సహాయ బృందాల అవగాహన కార్యక్రమం – విధాతా సొసైటీ ఆధ్వర్యంలో  సామాజిక అభివృద్ధికి మహిళల ఆర్థిక స్వావలంబన చాలా కీలకం. ఈ నేపథ్యంలో  విధాతా స్వచ్ఛంద సేవా సంస్థ  ఆధ్వర్యంలో  వనస్థలిపురం ఎన్.జి.ఓస్ కాలనీ లో  స్వయం సహాయ బృందాల (Self Help Groups - SHGs) అవగాహన కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు SHGల ప్రాధాన్యత, ఉపయోగాలు, వాటి ద్వారా అందుకునే లాభాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బాగంగా SHG ల నిర్మాణ విధానం,సభ్యుల బాధ్యతలు, హక్కులు,బ్యాంకుల ద్వారా రుణాల సదుపాయాలు,వ్యాపార ప్రారంభానికి సూచనలు,ప్రభుత్వం అందించే పథకాలపై వివరాలు,నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి మొదలైన అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #మహిళాశక్తీకరణ #స్వయంసహాయబృందాలు #SHGఅవగాహన #విధాతాసొసైటీ #సమాజఅభివృద్ధి #మహిళానేతృత్వం #సామాజికసంక్షేమం #మహిళాఉద్యములు #నైపుణ్యఅభివృద్ధి #ఎన్జీఓకార్యకలాపాలు #వనస్థలిపురం ...