విధాతా సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ కౌన్సెలింగ్ కార్యక్రమం
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ కౌన్సెలింగ్ కార్యక్రమం ప్రస్తుత సమాజంలో కుటుంబ జీవనంలో ఎదురయ్యే సమస్యలు, మానసిక ఒత్తిడి, దాంపత్య విభేదాలు, తల్లిదండ్రులు–పిల్లల మధ్య అవగాహన లోపం వంటి అంశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబాల్లో శాంతి, ఐక్యత మరియు సుఖసంతోషాలు పెంపొందించాలనే ఉద్దేశంతో విధాతా స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుటుంబ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనుభవజ్ఞులైన కౌన్సెలర్లు పాల్గొని కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత, పరస్పర గౌరవం, సహనం, సమన్వయం, భావోద్వేగ నియంత్రణ వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. దాంపత్య జీవనంలో ఏర్పడే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర, యువత ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలి అనే విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విధాతా స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారి నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.సంస్థ వాలంటీర్లు వినయ్ , విద్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #VidhathaSociety #FamilyC...