నేడు (7, ఏప్రియల్) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 〰〰〰〰〰〰〰〰 ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అదంతా వేస్టే. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది. ━━━━━━━━━━━━━━━━ ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అయితే, నిత్యం పనుల్లో బిజీగా గడిపేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఐదు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండండి: 1. పౌష్టికాహారం, వేళకు భోజనం. 2. నిత్యం నీళ్లు తాగండి. 3. వ్యాయామం చేయండి. 4. తగిన నిద్ర అవసరం. 5. ఒత్తిడి దూరం చేసుకోండి. ━━━━━━━━━━━━━━━━ ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులమయంతో కూడుకున్న ఈ జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేట ప్రజలకు కొరవడింది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసం ఇరవై సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. [ ''నో యాక్షన్ టు డే.... నో క్యూర్ టుమారో - నేటి అచేతనం ....రేపటి అస్వస్థత''. ] 1. ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు-మూడు గ్లాసుల...