ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
నేడు (7, ఏప్రియల్) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
〰〰〰〰〰〰〰〰
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అదంతా వేస్టే. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది.
━━━━━━━━━━━━━━━━
ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అయితే, నిత్యం పనుల్లో బిజీగా గడిపేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఐదు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండండి:
1. పౌష్టికాహారం, వేళకు భోజనం.
2. నిత్యం నీళ్లు తాగండి.
3. వ్యాయామం చేయండి.
4. తగిన నిద్ర అవసరం.
5. ఒత్తిడి దూరం చేసుకోండి.
━━━━━━━━━━━━━━━━
ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులమయంతో కూడుకున్న ఈ జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేట ప్రజలకు కొరవడింది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసం ఇరవై సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
[ ''నో యాక్షన్ టు డే.... నో క్యూర్ టుమారో - నేటి అచేతనం ....రేపటి అస్వస్థత''. ]
1. ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు-మూడు గ్లాసుల నీటిని సేవించండి.
2. ప్రతి రోజు కనీసం పదిహేను నిమిషాలపాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి.
3. ఉసిరి లేదా త్రిఫలాతో కూడుకున్న నీటిని సేవించండి.
4. వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి.
5. టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి.
6. ఉదయాత్పూర్వమే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి.
7. మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి-మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి.
8. భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి.
9. భోజనంలో సలాడ్, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి.
10. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులుండేలా చూసుకోండి.
11. మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి.
12. ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నానం చేయండి. దీంతో శరీరం శుభ్రమవ్వడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు.
13. ఉదయం మీరు తీసుకునే అల్పాహారం తేలికపాటిదై ఉండాలి. త్వరగా జీర్ణమయ్యేదిగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
14. నిద్రకు కృత్రిమమైన సాధనాలను ఉపయోగించకండి.
15. మిగిలిపోయిన లేదా పాచిపోయిన ఆహారాన్ని తీసుకోకండి, దీంతో ఆకలి తీరడం మాట అలావుంచితే అనారోగ్యంపాలవ్వడం ఖాయం.
16. పండ్లు తీసుకునేటప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి మరీ తీసుకుంటే మంచిది. ఎక్కువరోజులు నిల్వవుంచిన పండ్లను తీసుకోకూడదు.
17 ఉదయం-రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా దంతావధానం చేయాలి.
18. సమయానుసారం భోజనం చేయాలి, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి.
19. అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటిన రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమౌతాయి.
20. మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. దీంతో ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
━━━━━━━━━━━━━━━━
వేసవిలో అతి త్వరగా స్పాయిల్ అయ్యే ఆహారాలేంటో తెలుసుకుందాం...
1. పాలు:
2. బటర్:
3. రోటీస్:
4. దాల్
5. వాటర్ మెలోన్:
6. కోకనట్ కర్రీలు:
7. చట్నీలు:
8. నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు: (టమోటో, గార్డ్స్, గుమ్మడి, ఆరెంజ్ వంటివి)
9. పెరుగు:
10. పాస్ట్రీస్: (క్రీమ్ అధికంగా ఉండటం వల్ల)
11. చికెన్:
12.
బంగారు, వెండి నాణేల కంటే ఆరోగ్యమే మనకు నిజమైన సంపద

Comments
Post a Comment