విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపే రోజు గణతంత్ర దినోత్సవం – జనవరి 26. 1950 సంవత్సరంలో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ చారిత్రాత్మక రోజును దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వనస్థలిపురంలోని ఎన్జీఓస్ కాలనీలో విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమైంది. వేదికను దేశభక్తి భావాలను ప్రతిబింబించే త్రివర్ణ పతాకాలు, బ్యానర్లు మరియు అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. విధాత సొసైటీ సభ్యులు, కాలనీవాసులు, పిల్లలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పతాక ఆవిష్కరణ అనంతరం అందరూ గౌరవంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు G. శ్రీలత గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #RepublicDay #RepublicDayCelebrations #VidhathaVoluntaryOrganization #VidhathaSociety #NGOWorks #Vanastalipuram #Pat...