వృద్ధాశ్రమంలో ఉచిత అన్నదాన కార్యక్రమం – విధాతా స్వచ్చంద సంస్థ
వృద్ధాశ్రమంలో ఉచిత అన్నదాన కార్యక్రమం – విధాతా స్వచ్చంద సంస్థ సేవ చేయడం అంటే కేవలం దానం చేయడం కాదు, మనసును పంచడం. ఇదే భావంతో విధాతా స్వచ్చంద సేవా సంస్థ పనామా ప్రాంతంలోని వృద్ధాశ్రమంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమంలోని పెద్దలకు ఆహారం పంపిణీ చేయడం జరిగింది. వయస్సుతో శారీరక శక్తి తగ్గినప్పటికీ, ప్రేమ కోసం ఎదురుచూస్తున్న పెద్దలకు విధాతా సొసైటీ సభ్యులు తమ ప్రేమను, ఆదరాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విధాతా సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారు నిర్వహించడం జరిగింది.విధాతా సొసైటీ సమాజంలో నిరుపేదలు, ఆశ్రయం లేని వారు, వృద్ధులు వంటి వర్గాలకు సహాయం చేయడం తమ ప్రధాన ధ్యేయంగా కొనసాగిస్తోంది. అలాగే ఈ కార్యక్రమంలో సంస్థ వాలంటీర్లు సుజాత,నవనీత, అరుణ్,అనిల్,వినయ్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమాలకు ఆహారం, అవసరమైన వస్తువులు అందించేందుకు లేదా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలనుకునే వారు విధాతా స్వచ్చంద సేవా సంస్థను సంప్రదించండి. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #Vi...