విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ( S kill Development Programme in Tailoring) ప్రస్తుత కాలంలో స్వయం ఉపాధి అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన మార్గం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, యువతికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విధాతా సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ( S kill Development Programme in Tailoring) నిర్వహించడం జరిగింది.మహిళలకు, నిరుద్యోగ యువతికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి జీవితాల్లో స్వావలంబనను తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి బేసిక్ టైలరింగ్ టెక్నిక్స్,అడ్వాన్స్‌డ్ డిజైనింగ్,బ్లౌజ్,చుడిదార్, పిల్లల డ్రెస్సులు, స్కర్ట్‌లు మొదలైనవి నేర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 40 మంది మహిళలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విధాత స్వచ్చంద సేవాసంస్థ అధ్యక్షురాలు శ్రీలత గారు నేతృత్వంలో నిర్వహించడం జరిగింది.సంస్థ వాలంటీర్లు అనిత ,కల్పన, విద్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: ...