విధాత సొసైటి ఆధ్వర్యంలో క్యాన్సర్ దినోత్సవం
విధాత సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల సంక్షేమం కోసం క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ రోగులకి మద్దతు అందించడానికి వారి బాధను తేలికపరచడానికి విధాత సొసైటీ బాధ్యత తీసుకొని ఒక కార్యక్రమాన్ని చేపట్టింది.
విధాత స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమం ద్వారా కేన్సర్ రోగులకు అవసరమైనటువంటి వైద్య సాయం, ఆర్థిక సహాయం, మానసిక మద్దతు వంటి అనేక రకాల సాయాలను అందించింది. రోగుల సంక్షేమం కోసం మనం చేసిన ప్రతి పని వారికి బలాన్ని ఇస్తుంది అని ఆ కార్యక్రమాలలో పాల్గొన్న నిపుణులు చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమం లాంటి అనేక కార్యక్రమాలు ముందు ముందు నిర్వహించాలని ఆ కార్యక్రమాలలో పాల్గొన్న బాధితులు వ్యక్తపరిచారు.
- వైద్య నిపుణులతో సమాలోచనలు
- రోగులకు ఉచిత ఆరోగ్య సలహా
- ఆర్థిక సహాయం కోసం విరా
- ళాల సేకరణ
- రోగుల కుటుంబాలకు మానసిక మద్దతువంటి అనేక కార్యక్రమాలను ఈ విధాత సొసైటీ గత కొన్ని సంవత్సరాలుగా చేపడుతూ వస్తుంది. అనేకమంది ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు.అలాగే ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు కాలనీ పెద్దలు విధాత స్వచ్ఛంద సంస్థకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అలాగే వాలంటరీస్ పాల్గొన్నారు.విధాత స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ శ్రీలత గారు, ఇతర సభ్యులు కేయూర మాన్వి, జ్యోతి, మహేశ్వర్,హార్ధిక్ మరియు వాలంటీర్లు సౌజన్య,కల్పన,మాధవి,సంతోషి, విజయ, వసంత ,హర్షియ పాల్గొన్నారు.

Comments
Post a Comment