విధాత సొసైటీ ఆధ్వర్యంలో - ముగ్గుల పోటీలు విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో కాలనీకి చెందిన మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు తమ ప్రతిభను, సృజనాత్మకతను ముగ్గుల రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు.ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం విధాత సొసైటీ అధ్యక్షురాలు శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పోటీలలో పాల్గొన్న వారిని ప్రోత్సహించేందుకు విజేతలకు మరియు పాల్గొన్న వారందరికీ బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం కాలనీలో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చి, మహిళలు మరియు పిల్లలలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #VidhathaSociety #SankranthiCelebrations #MugguCompetition #RangoliArt #CommunityEvent #WomenAndChildren #FestiveVibes #CulturalTradition #Vanasthalipuram #TogetherWeCelebrate Vidhatha Society Sankranthi Muggu Competition On the occasion of the Sankranthi festival, Vidhatha S...
విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళల కోసం సంక్రాంతి స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో భాగంగా మహిళలు వివిధ రకాల పిండి వంటలు మరియు స్వీట్స్ తయారు చేసి తీసుకురావడం జరిగింది. పాల్గొన్న మహిళలు తమ వంటక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా మార్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ప్రోత్సాహకంగా గిఫ్టులు కూడా అందజేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు . 📞 మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #VidhathaSociety #SankrantiCelebrations #WomensEmpowerment #SankrantiSpecial #FoodCompetition #TraditionalFood #WomenPower #CommunityEvent #IndianFestivals #CelebrateTraditions Sankranti Special Women’s Food Competition On the occasion of Sankranti , Vidhatha Society successfully organized a Sankranti Specia...
విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న MSME అవగాహన సదస్సు మీరు వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? కానీ ఏ బిజినెస్ మీకు సరిపోతుందో, ఎలా మొదలుపెట్టాలో తెలియక సందేహాల్లో ఉన్నారా? అనుభవం లేకపోతే ట్రైనింగ్ ఎక్కడ తీసుకోవాలి? ట్రైనింగ్ పూర్తయ్యాక బిజినెస్ పెట్టుకోవడానికి లోన్ ఎలా తీసుకోవాలి? లోన్ ఎవరు ఇస్తారు? సబ్సిడీ ఉంటుందా? లోన్ కోసం ఏ సర్టిఫికెట్లు కావాలి? బిజినెస్ ప్రారంభించిన తర్వాత సెక్యూరిటీ ఎలా ఏర్పాటు చేసుకోవాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి కొత్త వ్యాపారవేత్త మనసులో సహజంగానే వస్తాయి. ఈ అన్ని సందేహాలకు ఒకే చోట సరైన సమాధానాలు తెలుసుకునే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తోంది. విధాతా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న MSME అవగాహన సదస్సు లో MSME అధికారులు, బ్యాంకర్లు, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్ అందరూ ఒకే వేదికపై పాల్గొని, మీ సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. వ్యాపారం ప్రారంభించే ముందు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగించుకోవాలి, లోన్ మరియు సబ్సిడీ అవకాశాలు ఏమిటి అన్న విషయాలపై స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఈ అవగాహన సదస్సు అటెండ్ అవడం వల్ల మీరు బిజినెస్ ప్రారంభించే ముం...
Comments
Post a Comment