విధాత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే
విధాత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం
నేషనల్ డాక్టర్స్ డే ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జరుపుకుంటారు. ఈ దినాన్ని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ గారిని స్మరించడానికి, ఆయన పుట్టిన రోజు మరియు గౌరవార్థం జరుపుతారు. వైద్యుల సేవలను గౌరవించడానికి, వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజు ప్రత్యేకం.
విధాత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో వివిధ వైద్య రంగాలలో విశేష సేవలు అందించిన వైద్యులకు ప్రశంసా పత్రాలు, మొమెంటోస్ సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలు, 120 మందికి పైగా ఉచితంగా బిపి , షుగర్ కి సంబంధించిన పరీక్షలు, గుండె కు సంబంధించిన ECG పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, గైనిక్, ఆర్థోపెడిక్, జనరల్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డా. మధు, డా.యోగేష్ మరియు విధాత స్వచ్ఛంద సంస్థ సభ్యులైన శ్రీమతి శ్రీలత, శ్రీ జ్యోతి మహేశ్వర్, హార్ధిక్ ఫాల్గుణసఖ, మరియు వాలంటీర్లు కమల, వసుమతి, భానుకిరణ్, వర్ష, పూజ, తేజ, శివరాం తదితరులు ఉత్సాహం గా పాల్గొన్నారు .

Comments
Post a Comment