WORLD HUNGER DAY
ప్రపంచంలో ప్రతిఒక్కరు తినడానికి అర్హులు. ప్రపంచంలో కనీసం 800 మిలియన్ల మందికి తినడానికి సరిపడా ఆహారం లేదని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. 2011లో, ది హంగర్ ప్రాజెక్ట్ వరల్డ్ హంగర్ డేగా పిలువబడే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆకలి, పేదరికానికి స్థిరమైన పరిష్కారాలను జరుపుకోవడం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ ఆకలి దినోత్సవంను ప్రతి సంవత్సరం మే 28 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఇది మొదట 2011 సంవత్సరంలో ప్రారంభమైంది. ‘వరల్డ్ హంగర్ డే’ ను ది హంగర్ ప్రాజెక్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రపంచ ఆకలి దినోత్సవం 2024 థీమ్ గా.. “అభివృద్ధి చెందుతున్న తల్లులు.. అభివృద్ధి చెందుతున్న ప్రపంచం.” గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా., యుద్ధం, కరువు, వాతావరణ మార్పులు ఇంకా మరెన్నో కారణంగా మహిళలు, పిల్లలు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారు. ఇందులో 1 బిలియన్ కంటే ఎక్కువ మంది కౌమార బాలికలు, మహిళలు నేడు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఆ ప్రభావాలు తల్లి నుండి బిడ్డకు వ్యాపిస్తాయి. పోషకాహార లోపం ఉన్న తల్లులు పోషకాహార లోపంతో కూడిన శిశువులకు జన్మనిస్తున్నారు. ఈ పిల్లలు వారి మెదడు ...