విధాత సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం
విధాత సొసైటీ ఆధ్వర్యంలో టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం విధాత సొసైటీ నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ, గ్రామీణ మహిళలకు స్వావలంబన కలిగించే దిశగా పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ క్రమంలో సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ కోర్సులో మహిళలకు కుట్టు, ఫ్యాషన్ డిజైనింగ్, దుస్తుల కొలతలు, ఫినిషింగ్ టెక్నిక్స్ వంటి విభిన్న అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించబడింది. శిక్షణ ద్వారా వారు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించగలరు లేదా టైలరింగ్ రంగంలో ఉపాధి పొందగలరు.కోర్సు పూర్తయిన సందర్బంగా విధాత సొసైటీ తరఫున సర్టిఫికేట్ ప్రదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి లక్ష్మీ రామమూర్తి గారు విచ్చేసి, శిక్షణ పూర్తిచేసిన మహిళలను అభినందించారు. ఆమె మాట్లాడుతూ — “మహిళల ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది. రవెలారా సొసైటీ తీసుకుంటున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం” అని పేర్కొన్నా...