Posts

Showing posts from August, 2025

విధాత సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల సంక్షేమ కార్యక్రమం

Image
వనస్థలిపురం ఎన్‌జీఓస్ కాలనీలో విధాత సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల కోసం సంక్షేమ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో వికలాంగులు స్వయం ఉపాధి పొందేలా నైపుణ్య అభివృద్ధి శిక్షణలు,అదేవిధంగా వైద్య పరీక్షలు, ఫిజియోథెరపీ సలహాలు,వికలాంగుల హక్కులు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం  శారీరక, మానసిక, దృష్టి లేదా శ్రవణ లోపాలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడలనే ముక్య ఉద్ధేశ్యంతో విధాత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా  ప్రజలు పాల్గొన్నారు. #VidhathaSociety #DisabledWelfare #CommunityCare #SkillDevelopment #ServiceToHumanity   Disabled Welfare Programme by Vidhatha Society A special welfare programme for the disabled was organized by Vidhatha Society at NGOs Colony, Vanasthalipuram . The programme aimed at empowering differently-abled individuals through skill development training to help them earn a livelihood. Additionally, medical check-ups, physiotherapy consultatio...

జాతీయ క్రీడా దినోత్సవం - వాలీబాల్ పోటీలు

Image
  జాతీయ క్రీడా దినోత్సవం - వాలీబాల్ పోటీలు విధాతా సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా  హైకోర్టు కాలనీ, హస్తినాపురం  లో  వాలీబాల్ టోర్నమెంట్  నిర్వహించబడింది. ఈ కార్యక్రమం క్రీడలకు ప్రోత్సాహం అందించేందుకు ఏర్పాటు చేయబడింది.ఈ కార్యక్రమాన్ని విధాతా సొసైటీ  అధ్యక్షురాలు   జి. శ్రీలత గారు నిర్వహించారు,ఈ ప్రత్యేక క్రీడా వేడుకలో కాలనీ పెద్దలు మధుసూదన్,కిషన్ రెడ్డి, గోవర్ధన్ మరియు  క్రీడాభిమానులు, రావెలారా సొసైటీ సభ్యులు జ్యోతి మహేశ్వర్,కేయూర మాన్వి,సులోచన పాల్గొన్నారు.వాలీబాల్ విజేతలకు విధాతా సొసైటీ  అధ్యక్షురాలు   జి. శ్రీలత గారు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించేందుకు విధాతా సొసైటీ కృషి చేస్తుందని తెలియజేశారు. 📞   మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #VidhathaSociety #NationalSportsDay #VolleyballTournament #SportsForAll #CommunityEngagement #CelebratingSports   National Sports D...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

Image
  విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం విధాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వనస్థలిపురం ఎన్‌జీఓస్ కాలనీలో  ఉచిత ఆరోగ్య శిబిరం  నిర్వహించబడింది.ఈ శిబిరంలో వైద్య నిపుణులు ప్రజలకు ఉచిత వైద్య సలహాలు, రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు , ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్య సలహాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విధాత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీలత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 70 మంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.  మన సమాజానికి సేవ చేయడానికి మనమందరం కలసి కృషి చేయవచ్చు! 📞   మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 Free Health Camp by Vidhatha Society Vidhatha Society successfully organized a Free Health Camp at Vanasthalipuram NGOs Colony. During the camp, expert doctors provided free medical consultations, blood pressure check-ups, sugar level tests, eye examinations, and basic health check-ups. Participants also received guidance...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేశ విగ్రహాల పంపిణీ

Image
విధాత సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేశ విగ్రహాల పంపిణీ విధాత సొసైటీ ఆధ్వర్యంలో  వనస్థలిపురం NGOs కాలనీలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి గణేశ విగ్రహాలను ఉచితంగా అందించడం జరుగుతుంది.భక్తులు, పర్యావరణ ప్రేమికులు మరియు అవసరమైన వారు మా విధాత సొసైటీని సంప్రదించండి.  విధాతా  సొసైటీ కార్యాలయం  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #విధాతసొసైటీ #మట్టిగణేశ్ #పర్యావరణహితం #వినాయకచవితి Free Clay Ganesha Idols Distribution by Vidhatha Society On the occasion of Vinayaka Chavithi, Vidhatha Society is distributing eco-friendly clay Ganesha idols free of cost at Vanasthalipuram NGOs Colony. Devotees, environmental enthusiasts, and those in need are invited to contact Vidhatha Society to avail of this service. 📞 For More Details or Participation: 9542366556 #VidhathaSociety #ClayGanesha #EcoFriendly #VinayakaChavithi

మట్టి గణేశ విగ్రహాల ఉచిత పంపిణీ

Image
మట్టి గణేశ విగ్రహాల ఉచిత పంపిణీ విధాతా  స్వచ్ఛంద సేవా సంస్థ  తరఫున ఈసారి కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా  మట్టి గణేశ విగ్రహాల (క్లే గణపతి)  ఉచిత పంపిణీ చేయబడును. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అనేక మంది ప్లాస్టిక్ లేదా పాప్ (POP) విగ్రహాలను వినియోగించడం వల్ల నదులు, చెరువులు మరియు భూమి కాలుష్యం చెంది ప్రకృతి నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మేము మట్టి గణపతుల ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. వీటి తయారీకి మట్టి మాత్రమే కాదు, విగ్రహం లోపల చెట్లు  మొలిచే విత్తనాలు (Seed Balls)  కలిపి తయారు చేయబడింది. పండుగ ముగిసిన తర్వాత మీరు గణపతిని నీటిలో  వేసిన తరువాత, ఆ మట్టిని కాస్త మట్టితో కలిపి భూమిలో నాటితే, కొన్ని రోజుల్లో  ఒక చిన్న మొక్క  వస్తుంది.  ఈ పండుగను పచ్చదనంతో జరుపుకుందాం. గణేశుని పూజించడమే కాదు, పర్యావరణానికి సేవ చేయడం కూడా మన భక్తి రూపమే.  మీరు కూడా ఈ సీడ్ గణేశ్ విగ్రహాన్ని పొందాలనుకుంటే వెంటనే సంప్రదించండి: విధాతా  సొసైటీ కార్యాలయం  మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి:   9542366556 #SeedGa...

విధాత సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమ సేవలు

Image
విధాత సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమ సేవలు విధాత సొసైటీ  ఆధ్వర్యంలో  గత కొన్ని ఏళ్లుగా వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ, ప్రేమతో సేవలం దిస్తోంది. ప్రస్తుతం మా వృద్ధాశ్రమంలో 30 మంది వృద్ధులు నివసిస్తున్నారు.వారి కోసం మేము ప్రతిరోజూ పోషకాహారం, పండ్లు, దుస్తులు, ఔషధాలు, వైద్యపరీక్షలు, యోగా మరియు ధ్యాన శిక్షణలు వంటి అన్ని సౌకర్యాలను అందిస్తున్నాము. మా సేవలు మరింత విస్తరించి, ఇంకా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు మాకు ధాతల సహాయం అవసరం.  మీరు అందించే విరాళాలు లేదా దానాలు ఈ వృద్ధుల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం మరియు భరోసా నింపుతాయి. ఎవరైనా ధాతలు ముందుకు వచ్చి  మీ సహకారం అందించాలి అని   మా యొక్క విధాత సొసైటి &  వృద్ధాశ్రమo తరపున  కోరుకుంటున్నాము.  gpay కానీ, phonepay  ద్వారా కానీ పంపగలరు .  9666602371 సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :   9542366556 #VidhathaSociety #OldAgeHome #ElderlyCare #SupportSeniors #Charity #DonateNow #HumanityFirst #CareForElders #CommunityService #SpreadLove Vidhatha Society – Spreading Care Through Our Old Age Home F...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
  విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు  నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని పనామా  వద్ధ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.  ఆకలితో ఉన్న వారికి వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు  సంస్థ  సభ్యులు  కేయూరా మాన్వి,  జ్యోతి మహేశ్వర్,సులోచన  అలాగే  వాలంటీర్లు బాలు,అర్జున్, నైనీక,అనిల్,సరోజినీ,వసంత  తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా, మీ పెళ్లిరోజు...

విధాత సొసైటీ ఆద్వర్యంలో తయారు చేయబడిన పచ్చళ్ళు పిండి వంటలు,స్వీట్ & హాట్

Image
  విధాత సొసైటీ ఆద్వర్యంలో తయారు చేయబడిన పచ్చళ్ళు పిండి వంటలు,స్వీట్ & హాట్ విధాత సొసైటీ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో రుచికరమైన ఇంటి వంట పదార్థాలు, వివిధ రకాల పచ్చళ్ళు,రుచికరమైన పిండి వంటలు,స్వీట్ & హాట్ తయారు చేయబడును.  మీకు ఎలాంటి ఐటమ్స్ కావాలి అంకున్న వారు మా విధాత సొసైటి సంప్రదించండి.ముఖ్యంగా, మీరు ఇచ్చే ప్రతి ఆర్డర్ ద్వారా మా ఎన్‌జీఓలో పనిచేసే మహిళలకు ఉపాధి లభిస్తుంది. ఈ విధంగా మీరు రుచికరమైన పచ్చళ్ళను ఆస్వాదించడమే కాకుండా, మహిళల ఆర్థిక స్వావలంబనకు కూడా తోడ్పడతారు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ :   9542366556 #VidhathaSociety #HomemadePickles #SnacksAndSweets #TraditionalTaste #WomenEmpowerment Pickles, Snacks, Sweet & Hot Items by Vidhatha Society  Under the guidance of Vidhatha Society , delicious homemade traditional food items are being prepared with care and hygiene. Different varieties of Pickles Tasty Flour Snacks Sweet & Hot Items  If you would like to order any of these items, please contact Vidhatha Society . Most importantly, ever...

స్వతంత్ర దినోత్సవ వేడుకలు

Image
  వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో  విధాత  స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో - స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో నింపే రోజు, స్వతంత్ర దినోత్సవం – ఆగస్టు 15వ తేదీ. 1947లో బ్రిటిష్ పాలన నుండి భారత్ స్వేచ్ఛను పొందిన ఈ ముఖ్యమైన రోజును దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా వనస్థలిపురంలోని ఎన్జీఓస్ కాలనీలో  విధాత  స్వచ్చంద సంస్థ  ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమైంది. వేదికను దేశభక్తి భావాలను ప్రతిబింబించే బానర్లతో, పతాకాలతో అలంకరించారు.  విధాత  సొసైటీ సభ్యులు, కాలనీవాసులు, పిల్లలు మరియు వృద్ధులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.పతాక ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని అందరూ శ్రద్ధగా ఆలపించారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు దేశభక్తి పాటలు, నాటికలు, నృత్య ప్రదర్శనలు చేశారు. వీటితో పాటు స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై ప్రసంగాలు కూడా వినిపించాయి, అవి అందరినీ ఎంతో ప్రేరణతో నింపాయి. ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గ...

విధాత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Image
  విధాత  స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో  అన్నదాన కార్యక్రమం విధాత   స్వచ్చంద సంస్థ   ఆధ్వర్యంలో  11  సంవత్సరాల   నుండి నిత్య  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.ఈ  కార్యక్రమంలో బాగంగా ఈ రోజు  నిరుపేదలకు, ఆశ్రయం లేని వారికి, కూలీ కార్మికులకు మరియు వృద్ధులకు ఉచితంగా ఆహారం అందించడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని వనస్థలిపురం ఎన్‌జి‌ఓ వద్ధ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ప్రజలు లబ్ది పొందారు.  ఆకలితో ఉన్న వారికి వారికి అలాగే వృద్ధులు, వికలాంగులు మరియు అనాథ పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి వారికి భోజనం అందజేశారు. ఈ కార్యక్రమాని  విధాత    సొసైటీ అధ్యక్షురాలు G. శ్రీలత గారి   ఆధ్వర్యంలో నిర్వహించబడింది మరియు  సంస్థ  సభ్యులు  కేయూరా మాన్వి,  జ్యోతి మహేశ్వర్,సులోచన  అలాగే  వాలంటీర్లు గణేష్,మహేష్,సరిత, శిరీష,అనిల్,సరోజినీ,వసంత  తదితరులు పాల్గొన్నారు.     విధాత    స్వచ్చంద సంస్థకి మీ పిల్లల పుట్టినరోజు సందర్బంగా మరియు మీ పెద్ధల జ్ఞాపకార్ధంగా,...