మట్టి గణేశ విగ్రహాల ఉచిత పంపిణీ
మట్టి గణేశ విగ్రహాల ఉచిత పంపిణీ విధాతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈసారి కూడా పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టి గణేశ విగ్రహాల (క్లే గణపతి) ఉచిత పంపిణీ చేయబడును. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అనేక మంది ప్లాస్టిక్ లేదా పాప్ (POP) విగ్రహాలను వినియోగించడం వల్ల నదులు, చెరువులు మరియు భూమి కాలుష్యం చెంది ప్రకృతి నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా మేము మట్టి గణపతుల ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. వీటి తయారీకి మట్టి మాత్రమే కాదు, విగ్రహం లోపల చెట్లు మొలిచే విత్తనాలు (Seed Balls) కలిపి తయారు చేయబడింది. పండుగ ముగిసిన తర్వాత మీరు గణపతిని నీటిలో వేసిన తరువాత, ఆ మట్టిని కాస్త మట్టితో కలిపి భూమిలో నాటితే, కొన్ని రోజుల్లో ఒక చిన్న మొక్క వస్తుంది. ఈ పండుగను పచ్చదనంతో జరుపుకుందాం. గణేశుని పూజించడమే కాదు, పర్యావరణానికి సేవ చేయడం కూడా మన భక్తి రూపమే. మీరు కూడా ఈ సీడ్ గణేశ్ విగ్రహాన్ని పొందాలనుకుంటే వెంటనే సంప్రదించండి: విధాతా సొసైటీ కార్యాలయం మరిన్ని వివరాలు లేదా పాల్గొనడానికి: 9542366556 #SeedGa...